October 23, 2026
Explore
జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున చిన్న వీరమ్మ నామినేషన్

జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున చిన్న వీరమ్మ నామినేషన్

October 23, 2026 | Andhra Pradesh

రామసముద్రం ముచ్చట్లు:

రామసముద్రం అక్టోబర్ 23 మండలం జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిగా పి. రెడ్డి వీరే గౌడ్ భార్య చిన్న వీరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. గంపనపల్లి, పూలపాడు, రామసముద్రం, మినికి ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పి. రెడ్డి వీరే గౌడ్ మాట్లాడుతూ… వైసీపీ అభ్యర్థిగా చిన్న వీరమ్మ రామసముద్రం మండల జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు.

Tags: Chinna Veeramma files nomination as YSRCP candidate for ZPTC