రాయచోటి ముచ్చట్లు:
గాలివీడు జెడ్పీటీసీకి టీడీపీ నుంచి ఇద్దరు హేమాహేమీలు నామినేషన్ వేయడంతో కూటమిలో కుంపటి రగులుతోంది. గురువారం జిల్లా ఇంచార్జి సుగవాసి ప్రసాద్ బాబు, శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మదనపల్లె కేంద్రంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఒకే స్థానానికి ఇద్దరు పోటీ పడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Tags;Internal strife within the Rayachoti alliance