October 22, 2026
Explore
డ్రగ్స్ వద్దు బ్రో.. చదువే ముద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో.. చదువే ముద్దు బ్రో

October 22, 2026 | Andhra Pradesh

  • మౌనం వీడండి.. మాదకద్రవ్యాల సమాచారాన్ని 1972కు తెలియజేయండి,
  • మత్తురహిత అన్నమయ్య జిల్లా సాధనే మన లక్ష్యం,
  • డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి

రాయచోటిముచ్చట్లు:

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాయచోటి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో రాయచోటి డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాల నియంత్రణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈగల్ టీం సభ్యులు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం–1985 (ఎన్‌డీపీఎస్ చట్టం), సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా), ఆపరేషన్ వజ్రప్రహార్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ చైతన్య వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలు, వినియోగం, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈగల్ టీం ఇన్‌చార్జి శ్రీనివాసులు, డైట్ అధ్యాపకులు, సిబ్బంది, ఈగల్ టీం సభ్యులు పాల్గొన్నారు.

Tags:Say no to drugs, bro—focus on your studies instead!