అనంతపురం ముచ్చట్లు:
తాడిపత్రి పట్టణంలో టీడీపీ కార్యాలయంపై రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది.పట్టణంలోని పోరాట కాలనీలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసిరినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, దాడికి పాల్పడింది ఎవరు? ఘటనకు గల కారణాలేంటి? కార్యాలయానికి ఎంతమేర నష్టం వాటిల్లింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి, దాడికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
Tags:Stone-pelting attack on TDP office in Tadipatri town