అమరావతిముచ్చట్లు:
అలాంటి వింతైన గ్రామం గుజారాత్ లో ఉంది. ఇది పూర్తి శాకాహార గ్రామం. గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో కొలువుదీరిన పాలిటానా గ్రామం పూర్తి వెజిటేరియన్ విలేజ్ గా పేరు తెచ్చుకుంది.ఈ గ్రామం శత్రుంజయ కొండల కింద ఉంది. ఈ ప్రాంతం జైన మతస్థులకు పరమ పవిత్రమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ కొండపై దాదాపు తొమ్మిది వందలకు పైగా పాలరాతి దేవాలయాలు అద్భుత శిల్పకళతో దర్శనమిస్తాయి. ఈ నేల ఆధ్యాత్మిక భావనలు, అహింసా సిద్ధాంతాలకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే మాంసాహారాన్ని, జంతువధను అధికారికంగా చట్టబద్ధంగా పూర్తిగా నిషేధించిన మొదటి సంపూర్ణ శాకాహార ప్రాంతంగా ఈ పట్టణం చరిత్ర సృష్టించింది.
Tags;A completely vegetarian village—India is home to many sacred sites and unique, unusual villages.