March 29, 2026
Explore
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత!

March 29, 2026 | Andhra Pradesh

పెద్దపల్లి ముచ్చట్లు:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పద్మశాలి వీధినుండి గంట సమ్మయ్య అనే వ్యక్తి ట్రాలీ ఆటోలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా..శనివారం మంథని పోలీసులు పట్టుకున్నారు.

ఎస్సై డేగ రమేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నుండి బేగంపేటకు వెళ్తున్న వాహనాన్ని ఏఎస్ఐ ముల్లయ్య గౌడ్, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య,లు ఆపి తనిఖీ చేయగా 4.60 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విచారించిన పోలీసులు బేగంపేటకు చెందిన తూర్పాటి రాజు, గంట సమ్మయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Illegally Transported PDS Rice Seized!