ఈనెల 30న జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)…..
ఇన్చార్జి మంత్రివర్యులతో పి-4 మరియు బడ్జెట్ కార్యక్రమాలలో పాల్గొననున్న జిల్లా కలెక్టర్….
మదనపల్లి ముచ్చట్లు:
ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 30న సోమవారం ఉదయం 10.00గం.ల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రితో పి 4 మరియు బడ్జెట్ పై సమావేశాల నేపథ్యంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చు. అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించగలరు.
Tags:Platform for Resolving Public Grievances at the Collectorate