మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో 27 ఎంపీటీసి సెగ్మెంట్లకు 27నామినేషన్లను స్వీకరించినట్లు ఆర్ఓ ప్రసన్న లక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 27 ఎంపీటీసీ సెగ్మెంట్లకు గానూ మొత్తం 27 నామినేషన్ల స్వీకరణ జరిగిందని.. ఇంకా 16 సెగ్మెంట్లకు అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉందని తెలిపారు. దాఖలైన నామినేషన్ లలో వైసీపీ నుంచి 17, టీడీపీ నుంచి 9, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్ స్వీకరించా మన్నారు. సీఐ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రక్రియను సజావుగా నిర్వహించామని తెలిపారు.
Tags: 27 nominations received in Madanapalle