లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లెలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్కిరెడ్డిపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ఐక్యత, క్రమశిక్షణతో పనిచేసి అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో మౌర్యా రెడ్డి, మండల అధ్యక్షుడు మదన్మోహన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: The goal is to win all the seats in the MPTC and ZPTC elections.