మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సమావేశం
మదనపల్లె ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఎన్నికల నిబంధనలు, సిబ్బంది, రాజకీయ పార్టీల బాధ్యతలను వివరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు, 100 లేదా 200 మీటర్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
Tags: Political parties’ awareness of election rules