రామాపురం ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు రామాపురం మండలంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం లక్కిరెడ్డిపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలోని ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎన్నికల నియమావళికి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Tags: RDO Srinivas inspected the election arrangements