October 20, 2026
Explore
పెద్దమండ్యం మండలంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

పెద్దమండ్యం మండలంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

October 20, 2026 | Andhra Pradesh

పెద్దమండ్యంముచ్చట్లు:

పెద్దమండ్యం మండలంలో ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలపై అవగాహన సమావేశం నిర్వహించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దమండ్యం మండలంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్‌ఐ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల సిబ్బంది పాటించాల్సిన విధివిధానాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి, చట్టపరమైన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

Tags: Meeting with representatives of political parties in Peddamandyam mandal