October 20, 2026
Explore
టి. సుండుపల్లిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు

టి. సుండుపల్లిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు

October 20, 2026 | Andhra Pradesh

టి. సుండుపల్లి ముచ్చట్లు:

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టి. సుండుపల్లి మండలంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని ఎస్‌ఐ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని, నలుగురికి మించి గుమికూడరాదని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు చేయవద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: Section 144 and the Police Act (Section 30) imposed in T. Sundupalli