- మీ వెంటే మేము ఉంటాం
- పెద్దిరెడ్డి ఫ్యామిలీ భరోసా
పుంగనూరుముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పదవికి వైఎస్సార్‌సిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలని , ఏ కష్టం వచ్చిన అండగా పార్టీ శ్రేణులకు వెన్నంటే ఉంటామని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు భరోసా కల్పించారు. మంగళవారం స్థానిక గెస్ట్హౌస్‌లో పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆగడాలకు చెక్‌పెట్టే రోజు త్వరలో ఉందన్నారు. ఎన్ని కేసులు పెట్టి అమాయకులైన పార్టీ శ్రేణులను జైలుకు పంపిన భయపడే ప్రసక్తే లేదన్నారు. నామినేషన్లు దాఖలు చేస్తే విజయం వైఎస్సార్‌సిపిదేనని , దీనికి ఉలిక్కిపడి తెలుగుదేశం పార్టీ వారు నామినేషన్లు వేయనివ్వకుండ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎంపి మాట్లాడుతూ ఏకష్టానికైన ప్రజలకు అండగా ఉంటామని , బెదిరింపులకు భయపడేది లేదని , ఎన్నికేసులు పెడతారో పెట్టుకోండి అంటు తగిన మూల్యమాత్రం చెల్లించే రోజు వస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, మాజీ ఎంపిపి భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags: File your nominations with courage