October 20, 2026
Explore
రాజరాజేశ్వరిదేవి అలంకారంలో పార్వతిదేవి

రాజరాజేశ్వరిదేవి అలంకారంలో పార్వతిదేవి

October 20, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవార్లను ప్రత్యేకంగా వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేశారు. మంగళవారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను నవదాన్యాలతో అలంకరించారు. అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పుమొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని రాజరాజేశ్వరిదేవి రూపంలో అలంకారించి కొలువుదీర్ఛారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Goddess Parvati adorned as Rajarajeswari Devi