నిబంధనల అమలుపై అధికారుల ప్రత్యేక దృష్టి
రేణిగుంట ముచ్చట్లు:
ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు, ఎన్నికల నియమావళి అమలులో భాగంగా రేణిగుంటలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హౌసింగ్ ఏఈ రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఇతర అనుమతిలేని వస్తువుల తరలింపును అరికట్టడంతోపాటు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించడం లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులు ఎన్నికల నిబంధనలను పాటించాలని, తనిఖీలకు అధికారులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం పాల్గొని తనిఖీల నిర్వహణలో సహకరించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Tags: Vehicle checks in the wake of elections