October 20, 2026
Explore
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి

October 20, 2026 | Andhra Pradesh

ఎన్నికల కమిషన్ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తప్పనిసరిగా పాటించాలి

మదనపల్లెముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లాలోని అన్ని మండలాల్లో సంబంధిత అధికారులు కోరారు.

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు… మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓలు) రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, పరస్పర సహకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు, సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అధికారులు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Tags: Political parties should cooperate to ensure that local body elections are conducted in a peaceful atmosphere.