సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ హెచ్చరిక
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ హెచ్చరించారు. నామినేషన్ కేంద్రంగా ఉన్న ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో అనుమతి లేని వ్యక్తులు గుమిగూడరాదని సూచించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యర్థులను బెదిరించడం, గొడవలు సృష్టించడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. వర్తించే నిషేధాజ్ఞలు, పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Tags: Strict action will be taken if anyone engages in disturbances during the nomination process.