October 20, 2026
Explore
నామినేషన్ల వేళ గొడవలు చేస్తే కఠిన చర్యలు

నామినేషన్ల వేళ గొడవలు చేస్తే కఠిన చర్యలు

October 20, 2026 | Andhra Pradesh

రాయచోటిముచ్చట్లు:

రాయచోటి అర్బన్ సీఐ బి.వి. చలపతి హెచ్చరిక

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాయచోటి అర్బన్ సీఐ బి.వి. చలపతి హెచ్చరించారు. అక్టోబర్ 21 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో అనుమతి లేని వ్యక్తులు గుమిగూడరాదని, ర్యాలీలు, ధర్నాలు, గొడవలు నిర్వహించరాదని సూచించారు. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: Strict action will be taken if there is any trouble during the nomination process.