పుంగనూరు ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రం వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించినట్లు పుంగనూరు మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జె. రాము తెలిపారు.
ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు పుంగనూరులోని కొత్తిండ్లు మున్సిపల్ హైస్కూల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్ కేంద్రం చుట్టూ 500 మీటర్ల పరిధిలో ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం, నినాదాలు చేయడం, లౌడ్‌స్పీకర్లు వినియోగించడం నిషేధమని స్పష్టం చేశారు.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, నిషేధిత పరిధిలో వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు అనుమతి లేదని తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags; Section 144 and Section 30 of the Police Act imposed in Punganur