విలేకరుల సమావేశంలో అంజుమాన్ కమిటీ సభ్యులు!
పుంగనూరుముచ్చట్లు:
స్థానిక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణకేసులో అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీంపై తప్పుడు కేసును నమోదు చేయడంపై ముస్లిం పెద్దలు మంగళవారం సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సలీం లేకపోయిన , ఘర్షణలతో సంబంధం లేకపోయిన తప్పుడు కేసు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు పుంగనూరులోని 26 మసీదులకు చెందిన అంజుమన్ కమిటి అధ్యక్షులు, సభ్యులు , ముతవల్లీలు తీర్మాణం చేసి, ప్రభుత్వానికి అల్టిమెటం జారీ చేశారు. ఈ మేరకు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడుకు లేఖ రాశారు. అంజుమన్ కమిటి అనేది ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సంబంధించిన సంస్థ అని, రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో పని చేస్తుందని వారు పేర్కొన్నారు. అంజుమన్ కమిటి , షాదీమహాల్ అభివృద్ధికి వైఎస్సార్‌సిపి , టీడీపీ నాయకులు గతంలో సహకారం అందించారని గుర్తు చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో ఎంఎస్.సలీం అక్కడ లేరని, ఘటనతో సంబంధం లేని వ్యక్తి పేరును ఎలా పెట్టారని నిలధీశారి. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే తదుపరి చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సలీంతో సహా మైనార్టీ మత పెద్దలు మాజీ అంజుమన్ కమిటి అధ్యక్షుడు షా, హజరత్ ఇర్ఫాన్, నూరుల్లా, బద్రుల్లాతో పాటు పెద్ద సంఖ్యలో ముతవల్లీలు , ఇమామ్‌లు పాల్గొన్నారు.
Tags: Remove the name of M. S. Salim Basha from the FIR!