October 20, 2026
Explore
మదనపల్లెలో పడిలేస్తున్న టమోటా ధరలు

మదనపల్లెలో పడిలేస్తున్న టమోటా ధరలు

October 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమోటా ధరలు రోజుకో మాదిరిగా పడిలేస్తున్నాయి. మార్కెట్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం యార్డుకు 98 మెట్రిక్ టన్నుల టమోటా అరైవల్స్ వచ్చాయి. 10 కిలోల ఫస్ట్ గ్రేడ్ టమోటా కనిష్టంగా రూ.190, గరిష్టంగా రూ.240 పలకగా, మోడల్ ధర రూ.230గా ఉంది. సెకండ్ గ్రేడ్ కనిష్టం రూ.120, గరిష్టం రూ.180, మోడల్ రూ.170గా ఉంది. కాగా వారం క్రితం మదనపల్లెలో రూ.400 పలికిన ధరలు ఇప్పుడు సగానికి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags: Tomato prices surging in Madanapalle