October 20, 2026
Explore
కుక్క అడ్డొచ్చి బైక్ బోల్తా.. ఎంపీడీవోకు తీవ్ర గాయాలు

కుక్క అడ్డొచ్చి బైక్ బోల్తా.. ఎంపీడీవోకు తీవ్ర గాయాలు

October 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి పడి ఎంపీడీవో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట ఎంపీడీవోగా పనిచేస్తున్న అబ్దుల్ సుకూర్ (58) విధి నిర్వహణలో భాగంగా మంగళవారం కురబలకోట మండలం అంగళ్లు నుంచి బైక్‌లో బి.కొత్తకోటకు బయలుదేరారు. మగసాలమర్రి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయనకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మరన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.

Tags: Bike overturns after dog gets in the way; MPDO sustains severe injuries