తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ ఉప్పల్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యయత్నం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘సర్జరీ అయ్యి కాలేజీ వెళ్లకపోతే లెక్చరర్‌లు చెడు వార్తలు ప్రచారం చేశారు. నా ఫోన్ తీసుకుని పర్సనల్ ఫొటోలు వైరల్ చేశారు. మా అమ్మ బాధపడుతుందని ఆమెకేమీ చెప్పలేదు. లేట్ ఫీ కట్టడానికి వెళ్తే ‘నువ్వు ఎవరెవరితో తిరిగావో మాకేం తెల్సు’ అని వేధించారు. సూసైడ్ అటెంప్ట్ చేశాను’ అని తెలిపారు. తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Tags: “They made my personal photos go viral,” says student.