October 19, 2026
Explore
లక్కిరెడ్డిపల్లెలో కార్డాన్ అండ్ సెర్చ్

లక్కిరెడ్డిపల్లెలో కార్డాన్ అండ్ సెర్చ్

October 19, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ముమ్మరం చేశారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో, సీఐ కృష్ణంరాజు నాయక్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లె పరిధిలోని దిన్నెపాడు, వడ్డేపల్లి, బెస్తపల్లి హరిజనవాడలలో తనిఖీలు చేపట్టారు. ఎస్ఐలు శోభ, నరసింహారెడ్డి, శివకుమార్, సిబ్బంది ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వాహన పత్రాలు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

Tags: Cordon and search in Lakkireddipalle