October 15, 2026
Explore
తండ్రిని కట్టెతో కొట్టి చంపిన కుమారుడు అరెస్ట్*

తండ్రిని కట్టెతో కొట్టి చంపిన కుమారుడు అరెస్ట్*

October 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె మండలం పులగూరవాండ్లపల్లె గ్రామంలో తండ్రిని కట్టెతో కొట్టి హత్య చేసిన కుమారుడిని తాలూకా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు చక్కర సహదేవ (50) మద్యం సేవించి ఇంట్లో గొడవ పడుతున్నాడని, ఈ నెల 13న రాత్రి కుమారుడు చక్కర సంతోష్ (24) కట్టెతో తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కట్టెను స్వాధీనం చేసుకున్నారు.

Tags;Son arrested for beating his father to death with a stick