పుంగనూరుముచ్చట్లు:
పాతకక్షల కారణంగా మహిళపై దాడి చేయడంతో 13 మంది పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కట్టక్రిందపాళెంకు చెందిన సుజాత అనే మహిళపై రెండు రోజుల క్రితం వినాయక నిమజ్జనానికి వచ్చిన 13 మంది ఆమెపై పాత కక్షల కారణంగా ఇంట్లోకి చొరబడి సుజాతపై దాడి చేశారు. ఈ మేరకు సుజాత స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు హేమ, సూర్య, పవన్, కర్వేపాకు శివ, గణి, చందు, వినయ్, బుజ్జి, లిఖిత్, అరుణ్, శ్రీకాంత్, వీరమణి, రవి లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు.
Tags; Case registered against 13 people