October 15, 2026
Explore
16 నుంచి నామినేషన్లు

16 నుంచి నామినేషన్లు

October 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి చైర్మన్‌ , కౌన్సిలర్‌ అభ్యర్థులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు సహాయ ఎన్నికల అధికారి మదుసూదన్‌రెడ్డి గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. 21న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలు స్థానిక బసవరాజ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను హైస్కూల్‌లో కేటాయించిన వార్డు కేంద్రాలలో సమర్పించాలని సూచించారు.

Tags;Nominations from the 16th