పుంగనూరుముచ్చట్లు:
దసరా ఉత్సవాలలో భాగంగా నాల్గవరోజు అమ్మవార్లను శ్రీ పార్వతిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. గురువారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని శ్రీలలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను జిడిపప్పుతో అలంకరించారు. అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పుమొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా శ్రీలలితా త్రిపుర సుందరిదేవి అలంకారంలో కొలువుదీర్ఛారు.అలాగే మండలంలోని చదళ్ల గ్రామంలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారిని శ్రీచాముండి అలంకారంలో కొలువుదీర్చి , భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


Tags;Goddess Parvati as Sri Lalita Tripura Sundari Devi