పుంగనూరు ముచ్చట్లు:
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ అభ్యర్థులకు ప్రజలు మద్దతివ్వాలి
సీపీఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సీపీఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తెలిపారు.
గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా తోపు కృష్ణప్ప మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కార్మికులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం, మెరుగైన రహదారులు, వీధి దీపాలు, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే ప్రజాప్రతినిధులు అవసరమని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ అభ్యర్థులు మున్సిపల్ కౌన్సిల్లో ప్రజల గొంతుకగా నిలిచి, ప్రజల హక్కుల సాధనకు కృషి చేస్తారని తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, కార్మికుల హక్కులు, పారదర్శక పాలన వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని సీపీఐ ప్రజల్లోకి వెళ్తుందని పేర్కొన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలు స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పుంగనూరు పట్టణ ప్రజలు అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రాంమూర్తి, సహాయ కార్యదర్శి మున్నా, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
Tags:CPI ready to contest in three wards in Punganur Municipality!