October 15, 2026
Explore
డివైడర్ను ఢీ కొట్టి డ్రైవర్ దుర్మరణం

డివైడర్ను ఢీ కొట్టి డ్రైవర్ దుర్మరణం

October 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి చిత్తూరుకు కారులో వెళ్తున్న అజహార్, అతని భార్య అయేషా ప్రయాణిస్తున్న కారు పుంగనూరు – పలమనేరు మార్గంలోని ముత్తుకూరు వద్ద అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వెంటనే పుంగనూరు, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Driver dies after crashing into a divider