October 15, 2026
Explore
పోలీసుల అదులో లేడీ డాన్ సులోచన

పోలీసుల అదులో లేడీ డాన్ సులోచన

October 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె, తదితర ప్రాంతాల్లో భూ కబ్జాలు చేసి అమాయకులను మోసం చేస్తూ,14 కేసుల్లో నిందితురాలుగా రౌడీ షీట్ కలిగి ఉన్న లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై ఇప్పటికే మదనపల్లె 1టౌన్, 2టౌన్, తాలూక తదితర పోలీస్ స్టేషన్లలో 14 చీటింగ్ కేసులతో పాటు భూ కబ్జా, హత్యా యత్నం వంటి కేసులు నమోదై ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డిఎస్పీ ప్రసాద్ ల ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు సులోచనను అదుపులోకి తీసుకున్నారు.

Tags: Lady Don Sulochana in police custody