అమరావతిముచ్చట్లు:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’ పథకానికి రూ.53,428 కోట్లతో ఆమోదం తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ అర్హతను 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. అలాగే 18 ఏళ్ల కనీస వయోపరిమితిని తొలగించి, పుట్టినప్పటి నుంచే అర్హులైన వారికి పెన్షన్ అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల కేంద్ర పెన్షన్ సహాయం 25% పెంచారు. ఈ నిర్ణయంతో అదనంగా 19.15 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరుతుంది.
Tags: Eligibility threshold for disability pension reduced to 40 percent: Centre