October 24, 2026
Explore
కడప పెద్ద దర్గా గంధం, ఉరుసు మహోత్సవాలకు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం

కడప పెద్ద దర్గా గంధం, ఉరుసు మహోత్సవాలకు సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం

October 24, 2026 | Andhra Pradesh

రాయచోటిముచ్చట్లు:

కడపలోని ఆమీన్ పీర్ పెద్ద దర్గా గంధం, ఉరుసు మహోత్సవాలకు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబుకు శనివారం ఆహ్వానం అందజేశారు.

రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న టీడీపీ కార్యాలయంలో దర్గా పీఠాధిపతుల శిష్య బృందం, ముస్లిం సోదరులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ, దర్గా ఉత్సవాలు మత సామరస్యం, సోదరభావం, సామాజిక ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, శాంతి సౌభ్రాతృత్వాలతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 24, 25 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Tags;Sugavasi Prasad Babu invited to the Gandham and Urs festivities at the Pedda Dargah in Kadapa