రాయచోటి ముచ్చట్లు:
పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి: హెల్త్ అసిస్టెంట్ విశ్వనాథరెడ్డి
రాయచోటి గ్రామీణ ప్రాంతంలోని చెన్నముక్కపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు శనివారం ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు చేపట్టారు. కొలిమిమిట్ట వీధిలో పాత సినిమా థియేటర్ సమీపంలోని ఖాళీ స్థలంతో పాటు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోని చెత్తను ట్రాక్టర్ ద్వారా తొలగించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. జయశ్రీ, సిబ్బంది ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యండపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు చెత్తను రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందజేస్తూ, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. గ్రామ పరిశుభ్రతకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
Tags:Intensive waste removal operations underway in Chennamukkapalle