-సమన్వయంతో ఎన్నికలకు సిద్ధంకండి
- ఎంపి మిధున్‌రెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
రెండన్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి, ఎన్నికలలో ప్రచారం సాగించాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి వైఎస్సార్‌సిపి నాయకులు , కార్యకర్తలకు ఉద్భోధించారు. బుధవారం సాయంత్రం ఆయన పట్టణంలో వైఎస్సార్‌సిపి నాయకులు, కార్యకర్తలు , కౌన్సిలర్ అభ్యర్థులతో విడివిడిగా 36 వార్డుల వారితోను సమీక్ష నిర్వహించారు. నామినేషన్లు, ఉపసంహరణ, పరిశీలనతో పాటు ఎన్నికల ప్రచారాన్ని పకడ్భంధిగా నిర్వహించాలని సూచించారు. వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను వైఎస్సార్‌సిపి లీగల్‌టీమ్ ద్వారా పరిశీలన చేసి, దాఖలు చేసుకోవాలన్నారు. లీగల్‌టీమ్ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఎంపి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలను ప్రతి ఒక్కరు ఐకమత్యంతో నిర్వహించాలని సూచించారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు స్థానిక సంస్థల నుంచి పునాధులను వేసుకోవాల్సి ఉందన్నారు. పరిపాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరు క్యాడర్ సలహాలు, సూచనలు తీసుకుని అందరిని కలుపుకుంటు ప్రచారాలు కొనసాగించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిన సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం , వెంకటరెడ్డి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, బలిజ సంఘ నాయకులు పూలత్యాగరాజు, కిషోర్, రాజేష్, గోవర్ధన, సాగర్, గోపి తదితరులు పాల్గొన్నారు.
Tags: Create awareness about the government’s anti-people policies.