పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు మున్సిపాలిటిలో 36 వార్డులను ఆయా కేటగిరిలకు రిజర్వు చేస్తూ ఎన్నికల అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 1వ వార్డు ఎస్టీ జనరల్, 2 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 4 జనరల్, 5 బీసీ జనరల్‌కు కేటాయించారు. అలాగే 6 బీసి జనరల్, 7 బీసీ మహిళ, 8 జనరల్ మహిళ, 9 బీసీ జనరల్, 10 జనరల్ మహిళ, 11 బీసీ మహిళ, 12 ఎస్సీ జనరల్, 13 బీసీ జనరల్, 14 జనరల్, 15 బీసీ మహిళ, 16 జనరల్, 17,18, 19, 20 జనరల్ మహిళ, 21 బీసీ జనరల్, 22 జనరల్ మహిళ, 23 బీసీ మహిళ, 24 జనరల్, 25 బీసీ జనరల్ ,26 ఎస్సీ జనరల్, 27 జనరల్, 28, 29 జనరల్ మహిళ, 30 జనరల్, 31 జనరల్, 32 జనరల్ మహిళ, 33 బీసీ మహిళ, 34 జనరల్ మహిళ, 35, 36 జనరల్, ఇందులో ఎస్టీలకు -1 , ఎస్సీలకు -3 , బీసీలకు -14 , జనరల్ మహిళలకు -10, జనరల్ కేటగిరిలో -8 వార్డులు కేటాయించారు.
బసవరాజ హైస్కూల్‌లో నామినేషన్లు…
మున్సిపాలిటికి జరిగే 36 వార్డులకు సంబంధించి చైర్మన్, కౌన్సిలర్ల నామినేషన్లను 16 నుంచి స్వీకరించేందుకు స్థానిక బసవరాజ హైస్కూల్‌లో ఏర్పాట్లు చేశారు. అన్ని నామినేషన్లు ఒకే ప్రాంతంలో దాఖలు చేసేలా చర్యలు తీసుకున్నారు.
Tags: Details of municipality ward reservations