మదనపల్లె ముచ్చట్లు:
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్ కుమార్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం.72/2026, తేదీ 13-10-2026 ప్రకారం అన్నమయ్య జిల్లాలోని మొత్తం 25 జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బి.కొత్తకోట, కలికిరి, మదనపల్లె, రామాపురం, రాయచోటి, సంబేపల్లి, వాల్మీకిపురం స్థానాలు UR (మహిళ)కు, చిన్నమండెం, గాలివీడు, కె.వి.పల్లి, ఎల్.ఆర్.పల్లి, పెద్దమండ్యం, సోమల స్థానాలు UR జనరల్‌కు కేటాయించారు. చౌడేపల్లి SC (మహిళ), నిమ్మనపల్లి, పుంగనూరు SC జనరల్‌గా, గుర్రంకొండ, కలకడ, కురబలకోట, సోదం BC జనరల్‌గా, మొలకలచెరువు, పీలేరు, పి.టి.ఎం, రామసముద్రం BC (మహిళ)గా, తంబళ్లపల్లి STగా ఖరారయ్యాయి. మొత్తం 25 స్థానాల్లో ST-1, SC-3, BC-8, UR-13 స్థానాలు ఉండగా, మహిళలకు 12, జనరల్‌కు 13 స్థానాలు దక్కాయి.
Tags: ZPTC reservations finalized in Annamayya district.