శ్రీ సత్య సాయి జిల్లా ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ గ్యాంగ్ లపై ప్రత్యేక నిఘా…
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్
క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ,వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ తెలియజేశారు.
ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన నేపథ్యంలో యువత మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.
బెట్టింగ్ లు నిర్వహించిన అటువంటి వాటిని ప్రోత్సహించిన ,వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
క్రికెట్ ని జూద క్రీడగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎస్పీ హెచ్చరించారు.
బెట్టింగ్ మాయలో పడి యువత తమ కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దన్నారు.
తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు.
జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు బెట్టింగ్ గ్యాంగ్ లపై ప్రత్యేక నిఘా పెట్టారని ఎస్పీ స్పష్టం చేశారు.
బెట్టింగ్ అనేది ఒక వినోదం కాదు అది ఒక వ్యసనమని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు.జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న లేదా వాటిని ప్రోత్సహిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100,112 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలా ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు.