మదనపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి పీఎస్ పరిధిలో 2022లో జరిగిన భూవివాద దాడి కేసులో నలుగురు నిందితులకు రాయచోటి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. చింతకుంటపల్లికి చెందిన నల్లతిమ్మారెడ్డిగారి చంద్రశేఖర్ రెడ్డి(63)పై భూవివాదంతో నిందితులు చెన్నారెడ్డి, పద్మారాణి, చంద్రశేఖర్ రెడ్డి, నగేష్ కుమార్ రెడ్డి కర్రలతో దాడి చేశారు. పోలీసులు క్రైమ్ నం.10/2022 కింద కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డా. ఇ. ప్రసూన తీర్పు వెలువరించారు. పకడ్బందీ దర్యాప్తుతో శిక్ష పడిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను అభినందించారు.
Tags: Four sentenced to three years in prison in land dispute case