పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్‌లో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గంగాధరనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగంలోని న్యాయం, స్వేచ్చ, సమానత్వం , సౌభ్రాతృత్వం వంటి విలువలను విద్యార్థులు అవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించి ప్రతిజ్ఞ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయూబ్ ,అయూబ్‌బాషా, ముభారక్‌పాషా, ఫయాజ్, సజ్జాద్, బావాజాన్ లు కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Constitution Day Celebrated Grandly