మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టించి నేరస్తులను పసిగట్టేందుకు పోలీసు శాఖలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ‘తార’ అనే జాగిలం చేరింది. మంగళగిరిలో 11 నెలల పాటు కఠిన శిక్షణ పొందిన ఈ జాగిలానికి పేలుడు పదార్థాలను పసిగట్టడంలో, గాలి వాసనతో నేరస్తులను ట్రాక్ చేయడంలో నైపుణ్యం ఉంది. ఆర్ఐ యు. రంగనాథ్ బాబు, ఏఆర్ఎస్ఐ ఎస్. వేణుగోపాల్ ఆధ్వర్యంలో హ్యాండ్లర్లు సి. సుబ్బరామరాజు, బి. ప్రసాద్ నాయక్ సోమవారం దీనిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఎదుట ప్రవేశపెట్టారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో దీని సేవలు వినియోగిస్తామని ఎస్పీ తెలిపారు.
Tags: ‘Tara’* joins the Annamayya district police force.