October 12, 2026
Explore
మదనపల్లె మున్సిపాలిటీలో బీసీలకే ఎక్కువ సీట్లు

మదనపల్లె మున్సిపాలిటీలో బీసీలకే ఎక్కువ సీట్లు

October 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీ జనరల్ -1, ఎస్టీ మహిళ -0, ఎస్సీ జనరల్ -2, ఎస్సీ మహిళ -1, బీసీ జనరల్ -10, బీసీ మహిళ -10, జనరల్ మహిళ -13, జనరల్ -11గా ఖరారు చేశారు. మొత్తం 48 వార్డుల్లో బీసీలకు 20 సీట్లు దక్కడంతో అత్యధిక సీట్లు వారికే లభించాయి.

Tags: BCs get the most seats in Madanapalle Municipality