ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మేయర్ స్థానాల రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
మేయర్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించిన అనంతరం ఆయా కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా రిజర్వేషన్లను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మేయర్, వార్డు సభ్యుల స్థానాలపై పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే అన్ని కార్పొరేషన్ల పరిధిలో కులాల వారీ గణాంకాల సేకరణ ప్రక్రియను సంబంధిత అధికారులు చేపట్టినట్లు తెలుస్తోంది. కొత్త డీలిమిటేషన్ నేపథ్యంలో వార్డుల పునర్విభజన జరిగినందున, రిజర్వేషన్ల కేటాయింపులో రోస్టర్ విధానం ఎలా అమలవుతుందన్న అంశం కీలకంగా మారింది.
మేయర్ స్థానాల రిజర్వేషన్లు, అనంతరం వార్డుల రిజర్వేషన్లు అధికారికంగా వెలువడిన తరువాతే ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags: Suspense over mayoral reservations for 17 corporations in Andhra Pradesh!