మదనపల్లె ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్ని స్థాయిల అధికారులతో ఆదివారం మదనపల్లెలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, పాత నేరస్థులను బైండోవర్ చేయాలని, కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించా లన్నారు. చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేయించాలని ఆదేశించారు.
Tags: District SP issues guidelines on local elections.