ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
బాధితులంతా ఇందువాసి గ్రామ దళితులే
ప్రమాద బాధితులు, కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు
గద్వాల ముచ్చట్లు:
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది, పలువురు గాయపడటం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ దుర్ఘటన పట్ల గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి తీరని లోటు కలిగించిన ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
అలాగే, ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ తరఫున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాయచూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి చెప్పడం జరిగింది..
ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
Tags: Horrific accident on the Bharatmala road in Karnataka.