గద్వాల ముచ్చట్లు:
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీలు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం తెల్లవారుజామున యాదగిరి జిల్లాలోని భారత్‌మాల జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను ట్రిప్పర్ ఢీకొట్టడంతో ఏసేపు (48) మృతి చెందగా, నాగన్న (40) కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. మొత్తం 32 మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కురుమన్న సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబంతో పాటు క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించి కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు.
Tags; Horrific accident: one dead, 32 injured.