October 9, 2026
Explore
కాన్షీరామ్‌కి ఘన నివాళి

కాన్షీరామ్‌కి ఘన నివాళి

October 9, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

బిఎస్‌పి వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరామ్‌ వర్ధంతిని శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో నిర్వహించారు. కాన్షీరామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు అంజప్ప మాట్లాడుతూ భారతదేశ బహుజనుల ఐక్యత కోసం పోరాడిన ఆశాజ్యోతి అని, సామాజిక ఉధ్యమ పీతామహుడు కాన్షీరామ్‌ అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు కాన్షీరామ్‌ కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాలసుబ్రమణ్యం, న్యాయవాది శ్రీనివాసులు, మహేష్‌, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Tags: Grand tribute to Kanshiram