రాజమండ్రి ముచ్చట్లు:
రాజమండ్రి జైల్లో ఉన్న ఎన్.సురేశ్ అనే ఖైదీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్ మెడల్ను కూడా సాధించి అరుదైన ఘనతను అందుకున్నారు.బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా సురేశ్ ఈ పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ వి. సన్యాసిరావు మాట్లాడుతూ, ఇది ఇతర ఖైదీలకు కూడా మంచి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.
Tags: Gold Medal for Rajahmundry Central Jail Inmate