తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు
బోరవెల్లి స్టేజి వద్ద డివైడర్‌ను ఢీకొన్న ద్విచక్ర వాహనం
మానవపాడు ముచ్చట్లు:
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది.
దసరా సెలవుల కోసం ఉండవల్లి మండలం పుల్లూరు వసతి గృహం నుంచి తన కూతురును ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తీసుకెళ్తున్న తండ్రి బైక్‌తో డివైడర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరు కోదండాపురం గ్రామానికి చెందినవారిగా సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.
Tags: Accident on the national highway…